వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌కు 72 గంటల ముందు బైక్ ర్యాలీలు నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్లను బెదిరించడానికి మోటార్ బైకులను సంఘ విద్రోహ శక్తులు వినియోగిస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, బంగాల్లోని ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిబంధనల గురించి అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు, ఎన్నికల పరిశీలకులకు తెలియజేయాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.