Dyson India Survey 2022: గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని వెల్లడించింది. డైసన్ అనే ఓ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 32,282 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 1,019 మంది భారతీయులు పాల్గొన్నారు.
రోజూ ఇల్లు ఊడుస్తున్నారు.. పరిశుభ్రతలో మనమే టాప్!
Dyson India Survey 2022: ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని డైసన్ అనే ఓ టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది.
dyson india survey 2022
సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలివీ..
- కరోనా మహమ్మారి భయంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లను తరచుగా శుభ్రం చేసుకున్నారు. 95% మంది ఇప్పటికీ అదే తీరుతో సాగుతున్నారు.
- భారత్‌లో 46% మంది గృహ పరిశుభ్రత విషయంలో మెరుగయ్యారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారానికి 5-7 సార్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా 40% మంది.. ఇంట్లో దుమ్ము కనిపించిన వెంటనే దాన్ని తొలగిస్తుండగా, భారత్‌లో అలాంటివారి శాతం దాదాపు 33%గా మాత్రమే ఉంది.
- ఇళ్లలోని ధూళి వైరస్‌లను కూడా కలిగి ఉంటుందన్న సంగతి 22% మంది భారతీయులకు తెలియదు.
- ఇంట్లోని దుమ్ము అంటే మట్టి, ఇసుక మాత్రమే అని భారత్‌లో 35% మంది భ్రమపడుతున్నారు.
- భారతీయుల్లో 54% మంది తమ పరుపులను, 72% మంది కర్టెన్లను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి:బ్రిటిషర్లు రాకముందే మనం చదువుల్లో టాప్.. తెల్లవారే తెల్లబోయేలా..