తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఇల్లు అందమైన చిత్రాలు నిండిన పొదరిల్లు - కర్ణాటక

కర్ణాటకు చెందిన ఆ యువతి పేరు అంబిక. లాక్​డౌన్​ సమయంలో ఖాళీగా కూర్చోకుండా ఇంటిగోడలపై అందమైన చిత్రాలు వేసింది. అలా ఇంటినంతా చిత్రాలతో నింపేసింది. అద్భుత కళాకండాలతో అందమైన బొమ్మల పొదరిల్లుగా కనిపిస్తోంది. అంబిక ఇంటిని మీరూ ఓసారి చూసేయండి.

House into an art gallery
అంబిక

By

Published : Mar 27, 2021, 2:19 PM IST

Updated : Mar 27, 2021, 3:08 PM IST

'అంబిక' బొమ్మల ఇల్లు అదిరింది..

లాక్​డౌన్​ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తమలోని కళను బయటపెట్టి ప్రశంసలు అందుకున్నారు పలువురు. అలాంటి కోవకే చెందుతారు కర్ణాటక దొడ్డబళ్లాపుర్​కు చెందిన అంబిక. దొరికిన ఖాళీ సమయంలో తనలోని చిత్రకళకు పదునుపెట్టింది. అయితే.. పేపర్​పై కాదండోయ్​.. తన ఇంటి గోడలను అందమైన చిత్రాలతో నింపేసింది. ఇంటిని అందమైన బొమ్మల పొదరిల్లుగా మార్చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

బుద్ధుని చిత్రం గీసిన అంబిక
ఇల్లు బొమ్మల వనం
ఇంటిగోడలపై అంబిక అందమైన చిత్రాలు
డోర్లపై చిత్రాలు
బిందెలపై బొమ్మలు
అంబిక' బొమ్మల ఇల్లు అదిరింది..
తలుపుపై 'అంబిక' చిత్రం
అబ్బురపరిచే చిత్రాలు
బీరు బాటిళ్లపై కళాకండాలు

కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర్​కు చెందిన చిన్నమ్మ, మంజునాథ దంపతుల కూతురు అంబిక. ఆమెకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. లాక్​డౌన్​లో ఇంట్లోనే ఉంటూ.. వినూత్న రీతిలో ఆలోచన చేసింది. ఇంటి గోడలపై బుద్ధుడు, ప్రకృతి సౌదర్యాలు, మహిళలకు సంబంధించిన చిత్రాలు వేసింది. అలా ఇంటినంత ఒక 'బొమ్మల గ్యాలరీ'గా మార్చేసింది. అయితే గోడలు పాడవుతాయేమోనని తల్లిదండ్రులు మొదట కంగారు పడ్డారు. కానీ ఇప్పుడా అందమైన చిత్రాల్ని చూసి మురిసిపోతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన ఈ చిత్రాల్ని చూసి తమ ఇంటికి కూడా ఇలాంటి బొమ్మల్ని వేయమని తన స్నేహితులు అడుగుతున్నారని చెబుతొంది అంబిక. గోడలపైనే కాదు.. బీర్​ బాటిల్​పై, రాళ్లపై.. చిత్రాల్ని గీస్తూ వాటిని అందమైన కళాకండాలుగా మార్చుతోంది.

ఆమె గీసిన వాటిల్లో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే 'వర్లీ ఆర్ట్' చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. పల్లెటూరి ఇల్లా? అన్నటుంది ఆ ఇల్లు. 'మండల్ ఆర్ట్' తదితర రకాల ఆర్ట్​ను కూడా ఆమె వేస్తుంది.

"చాలా రకాలుగా పెయింటింగ్​​ వేయడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలోనే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే వర్లీ ఆర్ట్​ని మా ఇంటి గోడలపై వేశాను. మండల ఆర్ట్​ను కూడా వేయడం వచ్చు. ఈ చిత్రాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాను. దాంతో చాలా మంది నా స్నేహితులు వారి ఇంటిలో కూడా ఇలాంటి పెయింటింగ్స్​ వేయమని కోరుతున్నారు."

-అంబిక, చిత్రకారిణి

ఇలా అలవోకగా అందమైన చిత్రాల్ని గీసే అంబిక.. బెంగళూరులోని సెంట్రల్​ కాలేజ్​లో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డ్రాయింగ్​ పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.

ఇదీ చదవండి:ఆదర్శ రైతన్న- వర్షపు నీటి కోసం 6కోట్ల లీటర్ల కుంట

Last Updated : Mar 27, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details