తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం మత్తులో గ్యాంగ్​ వార్.. తెగిపడిన చేతిని ఎత్తుకెళ్లిన వీధికుక్క - గ్యాంగ్​ వార్​లో తెగిపోయిన చేయి

మద్యం మత్తులో రెండు గ్యాంగ్​ల మధ్య గొడవ తలెత్తింది. పరస్పర దాడుల్లో ఓ యువకుడి చేయి తెగి పడిపోయింది. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Drunken Gang War
Drunken Gang War

By

Published : Nov 3, 2022, 11:33 AM IST

మద్యం మత్తులో రెండు గ్యాంగ్​ల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ గ్యాంగ్​లోని యువకుడి ఎడమ ముంజేయి తెగి పడిపోయింది. దాన్ని ఓ వీధికుక్క ఎత్తుకెళ్లిన ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..బీబీఎమ్ చదువుతున్న ప్రజ్వల్ తన స్నేహితులతో కలిసి కురుబరహళ్లిలోని కదంబ బార్​కు వెళ్లాడు. అదే సమయంలో హరీష్​ అనే వ్యక్తి ప్రజ్వల్ పక్క టేబుల్​లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అయితే ప్రజ్వల్​కు హరీష్​, యోగేష్​తో ఉన్న పాత కక్షల కారణంగా వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన బార్​ యజమాని రెండు గ్రూపులను బయటకు వెళ్లగొట్టాడు.

అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రజ్వల్,​ అతడి స్నేహితులు ఓ షాపు వద్ద నిల్చున్నారు. అనంతరం మళ్లీ హరీష్, అతడి గ్యాంగ్​ కార్​లో వచ్చి ప్రజ్వల్​తో గొడవకు దిగారు. ఆ తర్వాత కొడవలి లాంటి పదునైన ఆయుధంతో ప్రజ్వల్​పై దాడి చేశారు. దీంతో ప్రజ్వల్​ ఎడమ ముంజేయి తెగిపోయి కిందపడింది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు.

అయితే మత్తులో ఉన్న సమయంలో జేసీబీ ఢీకొట్టిందని, అందువల్లనే చేతికి గాయం అయిందని పోలీసులకు చెప్పాడు. కాసేపాగి మాట మార్చాడు. ఓ గ్యాంగ్​ తనపై దాడి చేసిందని, తెగిపోయిన చేతిని వారు తీసుకెళ్లారని చెప్పాడు. బాధితుడి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇరు గ్యాంగ్​లు గొడవ పడిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అయితే తెగిపోయిన చేతిని హరీష్​ గ్యాంగ్​ తీసుకెళ్లలేదు. అక్కడున్న ఓ వీధి కుక్క నోట కరచుకుని తీసుకెళ్లింది. దీంతో పోలీస్​ డాగ్​స్క్వాడ్​తో వీధి కుక్క ఎత్తుకెళ్లిన చేయి కోసం గాలించారు. కానీ అది దొరకలేదని పోలీసులు తెలిపారు. హరీశ్​తో పాటు ఈ ఘటనతో సంబంధమున్న కొంతమంది యువకులని మహాలక్ష్మి లేఅవుట్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి :బస్సు నడుపుతుండగా డ్రైవర్​కు మూర్ఛ

తండ్రి డ్రగ్స్​ బానిస.. స్టేషన్​లో పిల్లలు.. పసికందుకు పాలిచ్చిన పోలీస్ అమ్మ

ABOUT THE AUTHOR

...view details