బెంగళూరులోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఫుడ్ డెలీవరీ బాయ్స్ ముసుగులో వీరు కస్టమర్లకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. వీరి వద్ద ఉన్న రూ.60లక్షలు విలువ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరినీ ఝార్ఖండ్‌కు చెందిన రవి, రవి ప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని బెళ్లందూర్‌లో ఓ హాస్టల్లో వీరు ఉంటున్నట్లు తెలిపారు.
కళాశాల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గతనెలలో దాడులు చేసి పట్టుకుంది సీసీబీ ఇన్స్పెక్టర్ బీఎస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం. విచారణలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు రవి, రవి ప్రకాశ్‌లను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ దిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్ ముఠాలో వీరిద్దరూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. డార్క్ నెట్లో విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగులు చేసి బిట్ కాయిన్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రవి, రవిప్రకాశ్లకు అతడు పోస్టులో బర్త్‌డే గిఫ్ట్ ప్యాక్‌లా డ్రగ్స్ చేర్చేవాడు. అనంతరం వీరిద్దరూ కస్టమర్లకు వాటిని సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఫుడ్ డెలీవరీ సంస్థల ప్యాకింగ్ కవర్లను ఉపయోగిస్తున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఇద్దరి నుంచి 300 డ్రగ్ ట్యాబ్లెట్లు, 350 గ్రాముల చరాస్, 1.5కేజీ హైడ్రో గంజా, గిఫ్ట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు కస్టడీలోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఇదీ చదవండి:3 నెలల మనవడిని హత్య చేసిన అమ్మమ్మ.. ఆపై!