Drugs Smuggling Telangana 2023 : రాష్ట్రంలో మత్తుమందుల(Drugs Supply Telangana) వినియోగం విచ్చల విడిగా సాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారంటేనే.. ఈ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్తుమందుల సరఫరాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన.. సరఫరాదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎలాగైనా అరికట్టాలని చెప్పి.. తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(టీన్యాబ్)ను ఏర్పాటు చేసింది. అయినా వీటి రవాణా తగ్గలేదు.
Drugs Smuggling Hyderabad 2023 : ఈ ఏడాదిలోనే టీన్యాబ్ దాదాపు రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న సరకు అదనంగా ఉంది. డీఆర్ఐ అధికారులు ఈ నెల 30న ఒక్కరోజే రూ.50 కోట్ల విలువైన కొకైన్(Cocaine)ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అన్ని నార్కొటిక్స్ సంస్థ(Narcotics Organizations)లు కలిపి ఈ ఏడాది రూ.150 కోట్ల మత్తు పదార్థాలను పట్టుకున్నాయి. అయినా సరే సరఫరా గొలుసు మాత్రం తెగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కేవలం సరఫరాదారులను పట్టుకున్నారు తప్ప.. సూత్రధారులను పట్టుకోలేకపోవడమే. అసలైన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు తమతమ వ్యూహాలను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్ద ఎత్తున గంజాయి సీజ్.. గూడ్స్ ట్రక్కులో, ఇంట్లో 3వేల కిలోలకుపైనే..
Ganjayi Smuggling in Telangana 2023 : :ఈ ఏడాది టీన్యాబ్(TNAB) అధికారులు ఇప్పటివరకు 6 వేల కిలోల గంజాయి(Ganja)ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అయితే రాష్ట్రవ్యాప్తంగా 31వేల కిలోల పైచిలుకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్థానిక పోలీసులు, ఆబ్కారీ, డీఆర్ఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటివి దర్యాప్తులే దాదాపు 15 వేల కిలోలకు పైనే పట్టుకున్నారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగంలో గంజాయిదే పైచేయి అని చెప్పవచ్చు.
గంజాయి రవాణాకు కేంద్ర బిందువు తెలంగాణ : గతంలో ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువగా జరిగేది. అందులో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఎక్కువగా పండించేవారు. ఆ తర్వాత ఆబ్కారీ, పోలీసు శాఖల కృషితో తగ్గుముఖం పట్టింది. కానీ గంజాయి సాగులో ఆరితేరిన వారిలో.. ఇప్పుడు చాలా మంది రవాణాదారులుగా మారిపోయారు. దీంతో వీరితోనే తెలంగాణ రవాణాకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. దేశంలో అత్యంత నాణ్యమైన గంజాయి కేవలం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మాత్రమే పండుతోంది. అక్కడి నుంచే హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలి వెళుతుంది. అక్కడి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రంలో అదే స్థాయిలో పెరుగుతోంది.