మాదకద్రవ్యాలకు, ఆల్కహాల్‌కు బానిసైన ఓ మానవమృగం.. తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపావళి పండగ రోజు సంబరాలు చేసుకోవాల్సిన ఇంట్లోనే తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. గొంతుపై బ్లేడు పెట్టి చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు రాక్షసుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కిరాతకానికి పాల్పడిన యువకుడి శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
గాజియాబాద్‌లోని తిల్లా మోర్ మురికివాడలో బాధితురాలు నివసిస్తున్నారు. గురువారం రాత్రి యువకుడు తప్పతాగి ఇంటికి వచ్చాడు. మద్యంతో పాటు మాదకద్రవ్యాలు సైతం సేవించాడు. వచ్చీ రాగానే తల్లి వద్దకు వెళ్లాడు. కొడుకు నడవడిక తేడాగా ఉందని గ్రహించిన తల్లి.. అతడితో వారించింది. దీంతో పదునైన కత్తిని తల్లి మెడపై పెట్టి అరవకుండా నోరుమూయించాడు. తనకు లొంగకపోతే గొంతు కోసేస్తానని బెదిరించారు. దీంతో నిస్సహాయులైన మహిళ.. ఆ మానవమృగం చేసిన అకృత్యాన్ని మౌనంగా భరించారు.
ఈ వేదనను అనుభవించిన మహిళ.. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లింది. కొడుకుపై ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అసలు ఊహించలేదు..