పంజాబ్, హరియాణా రైతుల ఆందోళనలతో దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛలో దిల్లీ పేరిట రైతులు చేపట్టిన ర్యాలీని నగరంలోకి రానీయకుండా అన్ని ప్రవేశ మార్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఫలితంగా సాధారణ ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలినడకన వరుడు..
మేరఠ్‌లో వివాహ వేదిక చేరుకోవాల్సిన ఓ వరుడు.. దిల్లీ సరిహద్దుల్లో చిక్కుకుపోయాడు. వేరే మార్గం లేక కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి మేరఠ్‌కు చేరుకున్నాడు.