కరోనా వ్యాక్సిన్లపై వదంతులను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దేశ ప్రజలకు సూచించారు. రెండు వ్యాక్సిన్లు సురక్షితం, ప్రభావవంతం అని మరోమారు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే టీకాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక స్వల్ప అస్వస్థతకు గురవ్వడం సహజమేనని వివరించారు. అన్ని వ్యాక్సిన్లకు ఇలానే జరుగుతుందని చెప్పారు.
'టీకా సేఫ్- రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం' - vaccine latest updates
కరోనా టీకాలపై రాజకీయ దురుద్దేశంతోనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్దన్ విమర్శించారు. వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని మరోమారు స్పష్టం చేశారు.

'వ్యాక్సిన్ సేఫ్.. రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం'
కరోనా మహమ్మారిని సమాధి చేసేందుకు టీకాలు చివరి దశ అని హర్షవర్దన్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి వెనుకాడే ప్రజలు ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోవాలని కేంద్రం కోరుకోవడం లేదన్నారు. టీకాల ద్వారా మన వైద్యుల లాగే ప్రతి ఒక్కరు సమాన రక్షణ పొందాలని చెప్పారు.