Dont Tell These Things at Office :ఆఫీసులో తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్పుకోవడం సాధారణంగా జరిగేదే. అందులో కొన్ని సరదా సంభాషణలు.. మరికొన్ని సీరియస్ విషయాలు కూడా ఉంటాయి. సందర్భానికి తగ్గట్టుగా ఏదైనా సంఘటన జరిగితే ఎవరికివారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అంతవరకూ ఓకేగానీ.. వ్యక్తిగత విషయాలు మాత్రం అతిగా షేర్ చేసుకోవడం మంచిది కాదని అంటున్నారు మానసిక నిపుణులు. ఒక పరిమితికి మించి విషయాలు పంచుకోవడం వల్ల.. తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి, ఇంతకీ.. కొలీగ్స్‌తో ఏ విషయాలు షేర్ చేసుకోకూడదు? పరిమితి ఎంత వరకు విధించుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
These Things You Should Never Say at Work Place :ఆఫీస్‌లో ఇంటి విషయాలు, రిలేషన్‌షిప్ ముచ్చట్లు, ఫ్యాషన్ కహానీలు.. ఇలా అన్నీ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతుంటే మొదట్లో బాగానే ఉంటుంది. కానీ.. కొన్ని రోజులకు నెమ్మదిగా మీరు కొలీగ్స్ దగ్గర పలుచన అవుతారనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగని అసలు మాట్లాడొద్దని కాదు.. ఏ విషయం ఎంత వరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడి కట్ చేయడం మీకు తెలియాలి. అలా కాకుండా.. మీ ఇంటి విషయాలను కూడా స్టోరీలు స్టోరీలుగా చెబుతూ వెళ్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మీ ఇంటి విషయాలు అందరికీ ఆసక్తి కలిగించకపోవచ్చు. వినకపోతే మీరేమనుకుంటారో అని విన్నప్పటికీ.. ఆ తర్వాత మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశమూ లేకపోలేదనే విషయం మీరు గమనించాలని అంటున్నారు.
ఆఫీసు పని వేగంగా చేయాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఇక ఆడవాళ్లైతే శ్రీవారితో.. అబ్బాయిలైతే శ్రీమతితో చిన్నచిన్న తగాదాలు, మనస్పర్థలు మామూలే. అవన్నీ ప్రతీ ఇంట్లో ఉండేవే. అయితే.. అవి తాత్కాలికమైన గొడవలే అన్న సంగతి మరిచిపోవద్దు. ఆ సమయానికి అది పెద్ద విషయమే అనిపించొచ్చుకానీ.. ఒక్కరోజు సంయమనం పాటిస్తే వాటి తీవ్రత తగ్గిపోతుంది. నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. ఆ రోజు ఉన్న కోపం.. మర్నాడు ఉండదు.