తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి - chocolate firecrackers

బాణసంచాపై నిషేధంతో ఈసారి దీపావళి రోజు టపాసులు కాల్చే అవకాశం లేదని చాలా మంది నిరాశతో ఉన్నారు. అయితే వీటిని ఆస్వాదించేందుకు మరో మార్గం ఉంది. మీకు నచ్చిన టపాసులను ఏం చక్కా తినేయెచ్చు. వాటిని చూస్తేనే మీ నోరురూతుంది. ఈ తినే టపాసులేంటి? అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.

Don't burst these firecracker chocolates, eat them
ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి..

By

Published : Nov 14, 2020, 7:13 PM IST

Updated : Nov 17, 2020, 1:31 PM IST

ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి

దీపావళి అంటేనే ఇష్టమైన టపాసులు పేల్చి, చిచ్చుబుడ్లు వెలిగించి ఆహ్లాదంగా జరుపుకొనే పండుగ. అయితే ఈసారి కరోనా కారణంగా పర్యావరణానికి హానికరమైన బాణసంచా కాల్చడాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. దీంతో టపాసులు పేల్చే అవకాశం లేదే అని ఎంతో మంది నిరుత్సాహానికి గురయ్యారు. అయితే మీకు ఇష్టమైన టపాసులను ఆస్వాదించేందుకు మరో మార్గం ఉంది. వాటిని చాక్లెట్ల రూపంలో మీరు నోరారా తినేయొచ్చు.

ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి..

మహారాష్ట్ర మాహిమ్​కు చెందిన బేకరీ నిర్వాహకురాలు సారికా శాహు. పర్యావరణహిత బాణాసంచాపై అవగాహన కల్పించేందుకు ఆమె వినూత్న ఆలోచన చేశారు. అచ్చం టపాసులను పోలి ఉండేలా నోరూరించే చాక్లెట్లను తయారు చేస్తున్నారు. గత మూడెళ్లుగా దీపావళి పండుగ సీజన్​లో వీటిని విక్రయిస్తున్నారు. చాలా నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది.

లక్ష్మీబాంబు, సుతిల్​ బాంబు, చిచ్చుబుడ్లు, రాకెట్లు వంటి అన్ని రకాల టపాసుల ఆకృతుల్లో ఉన్న ఈ చాక్లెట్లు చూస్తేనే నోరూరేలా ఉన్నాయి. వీటిని తయారు చేసేందుకు 15 రోజుల సమయం పడుతుందని సారిక చెబుతున్నారు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడుతున్నారని తెలిపారు.

"గత మూడేళ్లుగా ఈ చాక్లెట్ టపాసులను తయారు చేస్తున్నా. వీటి కోసం దీపావళికి ముందు 15 రోజుల పాటు ఇంటివద్దే పని చేస్తా. రోజుకు 15నుంచి 20 కేజీల వరకు చాక్లెట్ టపాసులను విక్రయిస్తున్నా. కరోనా నేపథ్యంలోనూ డిమాండ్ బాగానే ఉంది. ఈ పర్యావరణహిత టపాసులను ప్రజలు ఎంతాగానో ఆస్వాదిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి కొనుగోళ్లు కాస్త తక్కువగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా టపాసులు లేకుండా దీపావళిని జరుపుకోరు. అందుకే వాటి ఆకృతుల్లో స్వీట్లను తయారు చేయాలనుకున్నా."

- సారికా శాహు.

ఈ ప్రత్యేక టపాసుల స్వీట్లను గతేడాది విదేశాలకు కూడా ఎగుమతి చేసినట్లు చెప్పారు సారికా. కరోనా కారణంగా ఈ ఏడాది స్వదేశానికే పరిమితమైనట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్​లోనూ..

ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి..

మధ్యప్రదేశ్​ భోపాల్​లోనూ మనీశ, డా. అనుపమ్​ అనే భార్యా భర్తలిద్దరూ చాక్లెట్​ టపాసులను తయారు చేస్తున్నారు. మిల్క్​ చాక్లెట్​, రోస్టెడ్​ ఆల్​మాండ్​, ఫ్రూట్​ నట్​ వంటి వివిధ రకాల వెరైటీలను అందుబాటులో ఉంచారు.

ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి..
Last Updated : Nov 17, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details