Pet Dog Solve Maths Questions Video Viral :విశ్వాసానికి మారు పేరు కుక్క. కానీ.. కొన్ని శునకాలు టాలెంట్ కూడా చూపిస్తాయి! అందరిచేత "వావ్" అనిపిస్తాయి. ఇలాంటి గ్రేడ్ 1 డాగ్స్‌కు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ పెంపుడు కుక్క వీడియో.. ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా కుక్కలు తమ యజమానుల వస్తువులను తీసుకెళ్లడం.. తోట పని విషయంలో సహాయ పడటం.. లేదంటే వారితో కలిసి ఆటలాడటం వంటివి మనం చూసి ఉంటాం. కానీ.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని కుక్క మాత్రం.. తన తెలివితేటలతో నెటిజన్లను అవాక్కయేలా చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ.. తన పెంపుడు కుక్కకు(Pet Dog) ఓ "పరీక్ష" పెట్టింది. అది వేరే ఏదో పరీక్ష కాదు.. చదువుకు సంబంధించిన టెస్ట్. కుక్కను ఎదురుగా కూర్చోబెట్టుకుని.. కొన్ని గణిత లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు అడిగింది.
Man Puts Poisonous Snake In to Mouth Viral Video : వీడెవడండీ బాబూ.. పాము మెడలో వేసుకొని.. తల నోట్లో పెట్టుకొని..
ఇందుకోసం.. ఆ శునకానికి ఎన్ని సార్లు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదుగానీ.. అన్నీ తీసివేతలకు సంబంధించిన ప్రశ్నలే అడిగింది ఆ మహిళ. మొదటగా 7-5 కి ఆన్సర్ ఏంటని కుక్కను అడగ్గా.. వెంటనే 2 అని తన కాళ్లతో నేలను రెండు సార్లు తట్టి చెప్పింది. దాంతో ఆమె శభాష్ అంటూ ఆ డాగ్‌ను మెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలను కూడా వేసింది. వరుసగా.. 4-1, 8-2, 10-7 ఎంత? అంటూ తీసివేతలకు సంబంధించిన క్వశ్చన్స్ వేసింది. అప్పుడు ఆ కుక్క తన కాళ్లతో అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పేసింది.
తన కుక్క తెలివికి సంబరపడిపోయిన యజమానురాలు.. చివరగా దానికో ముద్దు పెట్టి అభినందించింది. కుక్క కూడ సంతోషంగా ఆమెను హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇస్టాగ్రామ్‌లో ఆ మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోకు భారీ స్థాయిలో 1,86,868 లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాలో దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ ఒపీనియన్‌ను కామెంట్స్ రూపంలో చెప్పేస్తున్నారు. కొందరు.. 'ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ..' అంటూ కామెంట్ చేస్తే.. మరికొందరు 'ఇలాంటి కుక్క ఇంట్లో ఉంటే పిల్లలకు ట్యూషన్ అక్కర్లేదేమో.. 'అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. 'కుక్కగారు గణిత లెక్కలను భలే చెబుతుందే..!' అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం "ఇది బట్టీ పట్టిన కుక్క" అంటూ లాఫింగ్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.
Viral Video : వారెవ్వా.. ఏం టాలెంట్రా బుడ్డోడా..! నెట్టింట వీడియో వైరల్..!
Viral Video Four Year Old Boy Rides Royal Enfield : వయసు నాలుగేళ్లు.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో రౌండ్లేస్తున్నాడు!