తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Black Fungus: క్రికెట్‌ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌ - బ్లాక్‌ఫంగస్‌ చికిత్స

ఓ వృద్ధుడి మెదడులోంచి క్రికెట్​ బంతి పరిమాణంలో బ్లాక్​ ఫంగస్​ను(Black Fungus) విజయవంతంగా తొలగించారు పట్నా వైద్యులు. ఈ వ్యాధి ముక్కు నుంచి మెదడుకు చేరినట్లు తెలిపారు.

black fungus treatment
బ్లాక్‌ఫంగస్‌

By

Published : Jun 14, 2021, 7:03 AM IST

Updated : Jun 14, 2021, 8:36 AM IST

బిహార్‌ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఐజీఐఎంఎస్‌)లో 60 ఏళ్ల వ్యక్తి మెదడు నుంచి క్రికెట్‌ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్‌ఫంగస్‌ (Black Fungus)ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. జుమాయికి చెందిన అనిల్‌కుమార్‌కు డాక్టర్‌ బ్రజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్యబృందం గత శుక్రవారం మూడు గంటలపాటు ఈ శస్త్రచికిత్స చేసింది. బాధితుడి పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది.

అనిల్‌కుమార్‌ కొవిడ్‌ బారినపడి ఇటీవలే కోలుకున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనీశ్‌ మండల్ తెలిపారు. ఆ తర్వాత అతనికి తల తిరుగుతున్నట్టు ఉండటం వల్ల తమ వద్దకు తీసుకొచ్చారని, అప్పుడు బ్లాక్‌ఫంగస్‌(Black Fungus) బయటపడిందన్నారు. ఈ ఫంగస్‌ ముక్కు నుంచి మెదడుకు చేరిందని, కళ్లకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఇటువంటి కేసు ఆసుపత్రికి రావడం ఇదే ప్రథమం అని చెప్పారు.

ఇదీ చూడండి:Black fungus: ఆలస్యంగా గుర్తిస్తే.. అంధకారమే.!

Last Updated : Jun 14, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details