తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ వైద్యుడి గొప్ప మనస్సు.. ఫ్రీ సర్జరీతో పాక్ అమ్మాయికి కొత్త జీవితం

దిల్లీకి చెందిన ఓ వైద్యుడు.. అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ పాకిస్థానీ అమ్మాయికి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. రాజగోపాలన్​ చొరవతో ప్రస్తుతం ఆ బాలిక కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

దిల్లీలో వైద్యం
దిల్లీలో వైద్యం

By

Published : Jul 28, 2022, 1:58 PM IST

అరుదైన సమస్యతో బాధపడుతున్న అఫ్షీన్ గుల్ అనే ఓ పాకిస్థాన్​ అమ్మాయికి కొత్త జీవితాన్ని అందించారు దిల్లీ డాక్టర్. మెడ 90 డిగ్రీలు పక్కకు తిరిగిపోయి అవస్థ పడుతున్న ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకోసం కష్టమైన నాలుగు సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు డాక్టర్​ రాజగోపాలన్​ కృష్ణన్. బాలికకు ప్రధాన ఆపరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ సర్జరీ చాలా కష్టమైనదని.. తేడా వస్తే ఆమె గుండె, ఊపిరితిత్తులు ఆగిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స అంది ఉండకపోయి ఉంటే ఆమె ఎక్కువ కాలం బతికేది కాదని అన్నారు.

సర్జరీకి ముందు తండ్రి, వైద్యుడితో అఫ్షీన్
శస్త్రచికిత్స తర్వాత అఫ్షీన్

ఇదీ అఫ్షీన్​ కథ..: పాకిస్థాన్​లోని సింధ్​ ప్రావిన్స్​కు చెందిన అఫ్షీన్​ 10 నెలల వయసు ఉన్నప్పుడే ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె మెడ 90 డిగ్రీలు వంకర తిరిగిపోయింది. అప్పటి నుంచి ఆమె తినడానికి, మాట్లాడానికి ఎంతో ఇబ్బంది పడేది. ఈ వైకల్యంతోనే తన బాల్యం అంతా గడిచిపోయింది. స్కూల్​కు కూడా వెళ్లలేకపోయింది. దీనికి తోడు సెరిబ్రల్​ ప్లాసీ అనే మరో ప్రమాదకర వ్యాధి తోడైంది. అఫ్షీన్​ను ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. కానీ ఓ రోజు ఆమె తల్లి ఒక మెడికల్​ క్యాంప్​కు తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆమె దుస్థితి స్థానికంగా చర్చనీయాంశమైంది.

అలా దిల్లీకి: అఫ్షీన్​ దుస్థితి గురించి తెలుసుకున్న ఓ పాకిస్థానీ నటుడు ఆమె ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేసి సాయం చేయమని కోరాడు. ఈ ఫొటో కాస్త వైరల్​గా మారి దిల్లీలోని రాజగోపాలన్ దృష్టికి చేరింది. బాలిక తల్లిదండ్రులను సంప్రదించిన రాజగోపాలన్.. ఆమె దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తీసుకురమ్మని సూచించారు. అలా కొన్ని నెలల క్రితం భారత్​ చేరుకున్న అఫ్షీన్​కు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు రాజగోపాలన్. తమ కుమార్తెకు మళ్లీ బాగవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అఫ్షీన్ తల్లిదండ్రులు.

ఇదీ చూడండి :11 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్.. నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు!

ABOUT THE AUTHOR

...view details