తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​పై వచ్చి కాల్పులు- డాక్టర్ దంపతులు మృతి - రాజస్థాన్

కారులో వెళుతున్న డాక్టర్​ దంపతులను ఇద్దరు వక్తులు బైక్​పై కాల్చిచంపారు. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పూర్​లో జరిగింది. ఓ యువతి హత్య కేసులో డాక్టర్‌ దంపతుల ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే యువతి సోదరుడు వారిపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

doctor-couple-shot-dead-in-moving-car-in-bharatpur-both-killed
బైక్​పై వచ్చి కాల్పులు- డాక్టర్ దంపతులు మృతి

By

Published : May 29, 2021, 11:07 AM IST

Updated : May 29, 2021, 4:16 PM IST

రాజస్థాన్​లో భరత్‌పూర్​లో దారుణం జరిగింది. కారులో వెళుతున్న డాక్టర్‌ దంపతులను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించారు. అనంతరం వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డాక్టర్‌ దంపతులు అక్కడిక‌క్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

బైక్​పై వచ్చి కాల్పులు- డాక్టర్ దంపతులు మృతి

"వైద్యుడితో ఓ యువతికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ యువతి హత్య కేసులోనూ డాక్టర్‌ దంపతుల ప్రమేయం ఉంది" అని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే యువతి సోదరుడు వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Brutal Murder: కుమార్తెను ప్రేమించాడని ముక్కలుగా నరికి చంపాడు..

Last Updated : May 29, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details