Digital Rape Case: ఐదేళ్ల బాలికపై డిజిటల్ రేప్‌కు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్, బులంద్శకర్లోని ఖుర్జా దెహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం..బాధితురాలి పొరుగింట్లో నిందితుడు ఉంటాడు. బాలిక ఇంట్లో ఒకడిగా మెదిలేవాడు. ఈ క్రమంలోనే చిన్నారికి ఆహారం తినిపిస్తానంటూ ఆమె ప్రైవేట్ భాగాలను తాకటం వంటి వెకిలి చేష్టలకు పాల్పడడ్డాడు. ఇది గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.