భారత్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ఉచితంగా డీజిల్ వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు. క్యాన్లు పట్టుకుని మాకంటే మాకని డీజిల్ కోసం ఎగబడతారు. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ చమౌలీలో జరిగింది.
ఇదీ జరిగింది..
చమౌలీ కర్ణప్రయాగ్లోని బద్రీనాథ్ రహదారి ప్రాంతంలో ఓ డీజిల్ పైపు లీకైంది. ఈ క్రమంలో గోడ నుంచి డీజిల్ నీటిధారలా పారింది. ఇది చూసిన స్థానికులు.. క్యాన్లు, బాటిళ్లు పట్టుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్లు కూడా డీజిల్ కోసం ఎగబడ్డారు.