బంగాల్ ప్రజల నుంచి ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 'మేనల్లుడి కప్పం'(బైపో సర్వీస్ ట్యాక్స్) వసూలు చేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
'నందిగ్రామ్‌లో మమత కోపాన్ని ప్రదర్శించినప్పుడే ఆమె ఓడిపోతారని దేశం మొత్తం గ్రహించింది' అని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'బంగాల్లో గెలుస్తామని చెబుతున్నారు.. మోదీ ఏమన్నా దేవుడా?' అన్న మమత వ్యాఖ్యలపైనా స్పందించారు. 'మేము దేవుళ్లం కాము. కేవలం సాధారణ మనుషులం.. ప్రజలకు సేవచేసుకునే సాధారణ మనుషులం' అని దీదీకి.. మోదీ కౌంటర్ ఇచ్చారు. బంగాల్లోని కూచ్ బిహార్‌లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.