తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాన్పుర్​లో మరో 'జీఎస్​టీ' మోసం.. పక్కా ప్లాన్​తో ఒకేసారి సోదాలు!

Dggi raids on kanpur businessman: కాన్పుర్​​ వ్యాపారవేత్త పీయూష్​ జైన్ జీఎస్​టీ ఎగవేత మోసం మరవకముందే .. అదే నగరంలో మరో వ్యాపారవేత్త గుట్టు రట్టయింది. మయూర్ వనస్పతి సంస్థ యజమాని సునీల్​ గుప్తాకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో.. రూ.10 కోట్ల ఇన్​పుట్​ ట్యాక్స్ క్రెడిట్​ మోసాన్ని జీఎస్​టీ ఇంటెలిజెన్స్ బృందం గుర్తించింది.

Dggi raids on kanpur businessman
కాన్పుర్​లో మరో జీఎస్​టీ ఎగవేత మోసం

By

Published : Dec 29, 2021, 1:38 PM IST

Dggi raids on kanpur businessman: ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో అక్రమంగా నగదు కూడబెట్టిన మరో వ్యాపారి గుట్టు రట్టయింది. జీఎస్​టీ ఎగవేత కేసులో... మయూర్ వనస్పతి సంస్థ యజమాని సునీల్ గుప్తాకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్​టీ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఆ వ్యాపారి రూ.10 కోట్ల ఇన్​పుట్ ట్యాక్స్​ క్రెడిట్​ను మోసపూరితంగా క్లెయిమ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

Mayur vanspathi: మయూర్ వనస్పతి సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాలపై తాము దాడులు నిర్వహించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్​టీ ఇంటెలిజెన్స్​(డీజీజీఐ) అధికారులు తెలిపారు. అయితే.. పన్నులు చెల్లించేందుకు సునీల్ గుప్తా అంగీకరించారని చెప్పారు. ఈ దాడుల్లో తాము కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఈ కేసులో సునీల్ గుప్తాను అధికారులు అరెస్టు చేయలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు.

Piyush jain news: మరోవైపు... కాన్పుర్ వ్యాపారి పీయూష్​ జైన్​కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో డీజీజీఐ అధికారులు బుధవారంతో సోదాలు ముగించారు. మొత్తం రూ.194.45 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పీయూష్​ జైన్​కు కాన్పుర్​ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఇదీ చూడండి:'డొక్కు స్కూటర్​, రబ్బరు చెప్పులతో తిరిగి రూ.వందల కోట్లు దాచాడా?'

ఇదీ చదవండి:బ్యాంకు మాజీ ఛైర్మన్​పై ఈడీ కొరడా.. రూ.294కోట్ల ఆస్తులు జప్తు

ABOUT THE AUTHOR

...view details