Demonitized notes in Guruvayur temple భక్తుల కానుకలతో కేరళ త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి. అయితే ఇదే విషయంపై.. ఆలయ నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారు. అందేటి? కానుకలు ఇస్తే ఇబ్బందులు ఏం ఉంటాయి? అని అనుకుంటున్నారా? ఆ కానుకలు నోట్ల రూపంలో ఉండటం, ఆ నోట్లు రద్దు అయినవి కావడం కావడమే అసలు సమస్య!
గురువాయూర్ ఆలయాన్ని ప్రతి యేటా భారీ సంఖ్యలో ప్రజలు దర్శించుకుంటారు. నగదు రూపంలో కానుకలు సమర్పించుకుంటారు. అయితే నోట్ల రద్దు తర్వాత.. పాత కరెన్సీలు ఎక్కువగా హుండీల్లో దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లలో ఈ మొత్తం విలువ.. రూ. 1.35కోట్లుగా ఉంది. ఈ నగదుతో ఏం చేయాలో నిర్వాహకులకు అర్థంకావడం లేదు.