Deshmukh corruption probe: బలవంతపు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌పై(Param Bir Singh News) జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఇటీవల ఠాణే కోర్టు రద్దు చేయగా.. తాజాగా మరో వారెంట్(warrant against param bir) రద్దయింది. పరమ్‌బీర్ సోమవారం విచారణకు హాజరైన నేపథ్యంలో ఇటీవల జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేసింది జస్టిస్ కేయూ ఛాండివాల్ కమిషన్. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15వేలు జమ చేయాలని ఆదేశించింది.
సోమవారం విచారణకు హాజరైన సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేశారు పరమ్‌బీర్ సింగ్(Param Bir Singh). తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. విచారణను తప్పించుకోవాలనుకోలేదని తెలిపారు.
మరోవైపు.. పరమ్‌బీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేలు ఒకే గదిలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అనిల్ దేశ్‌ముఖ్ న్యాయవాది. ' సింగ్, సాక్షి(వాజే) ఇద్దరు గంటకుపైగా కలిసే కూర్చున్నారు. అతను(సింగ్) సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ' అని పేర్కొన్నారు.
ఇదీ కేసు..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్(Param Bir Singh) లేఖ రాశారు. హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్(anil deshmukh news) తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు.