Dera Baba Z plus security:హత్య, లైంగిక వేధింపుల కేసుల్లో జైలు అనుభవిస్తూ ఇటీవల సెలవులపై విడుదలైన డేరా సచ్ఛా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హరియాణా ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. ఖలిస్థానీ అనుకూల వర్గాల నుంచి రహీమ్‌కు ప్రాణముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
Dera Baba security:
'ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి రామ్ రహీమ్‌కు ముప్పు ఉందని హోంశాఖ నుంచి సమాచారం అందింది. రామ్ రహీమ్ దోషిగా తేలక ముందు నుంచే ఆయనకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తాజా నిర్ణయం తీసుకున్నాం' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జడ్ ప్లస్ భద్రతపై రోహ్తక్ రేంజ్ కమిషనర్‌కు సీఐడీ ఏడీజీ ఫిబ్రవరి 6న లేఖ రాశారని వెల్లడించాయి.