ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లకు బదులు పళ్లరసం ఎక్కించడంతో ఓ రోగి ప్రాణాలు కోల్పోయారు. ప్రదీప్ పాండే అనే వ్యక్తి ఇటీవల డెంగీతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 17 వేలకు పడిపోయింది. దీంతో వైద్యులు బయటినుంచి 'ప్లేట్‌లెట్ల ప్యాకెట్' తెప్పించి ఎక్కించడం మొదలుపెట్టారు.
ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. డెంగీ రోగి మృతి
ప్లేట్‌లెట్లకు బదులు పళ్లరసం ఎక్కించడం వల్ల ఓ డెంగీ రోగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
Etv Bharatdengue-patient
కొద్దిసేపటికే ఆయనలో ప్రతికూల స్పందనలు ప్రారంభం కావడంతో అప్రమత్తమై పరీక్షించగా.. తాము ఎక్కిస్తున్నవి ప్లేట్‌లెట్లు కాదని గుర్తించారు. అది పళ్లరసమని తేల్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రదీప్‌ను వేరే ఆసుపత్రికి తరలించారు. అయినా ఆయన ప్రాణాలు నిలవలేదు. పళ్లరసం ఎక్కించి రోగి మరణానికి కారణమైన ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.