Delivery of woman near railway crossing: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మార్గం సరిగా లేక, అంబులెన్సు రాకపోవడం వల్ల ఓ మహిళ పురిటినొప్పులతో అల్లాడిపోయింది. చివరకు ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రసవించింది. ఈ ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Labour giving birth on road:
పీర్ ఝాలర్ అనే గ్రామానికి చెందిన పూజ.. కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. పురిటినొప్పులు వచ్చేసరికి ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. 100కి డయల్ చేసి అంబులెన్సును పిలవగా.. సిబ్బంది వచ్చేందుకు నిరాకరించారు. రోడ్డు మార్గం సరిగా లేనందున రాలేమని తేల్చి చెప్పారు.
Ujjain latest news:
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మోసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కొద్దిదూరం వెళ్లగానే.. ఓ రైల్వే క్రాసింగ్ సమీపంలో మహిళకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మార్గమధ్యంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడే మహిళ ప్రసవించింది.