అవయవదానంపై చైతన్యం కల్పిస్తూ, అవయవదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒంటరిగా 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తిచేశాడు దిల్లీకి చెందిన 19 ఏళ్ల దక్ష యాదవ్.
అవయవదానంపై చైతన్యం..
అవయవదానంపై చైతన్యం కల్పిస్తూ, అవయవదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒంటరిగా 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తిచేశాడు దిల్లీకి చెందిన 19 ఏళ్ల దక్ష యాదవ్.
అవయవదానంపై చైతన్యం..
ఓ వ్యక్తి చనిపోయినప్పటికీ అవయవదానం ద్వారా మరో 80 మంది జీవితాలలో వెలుగులు నింపవచ్చు. ఈ సందేశంతోనే రెండు రోజుల క్రితం దిల్లీ నుంచి బయలుదేరిన దక్ష.. 700 కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం జైపుర్‌లోని అవయవదాన స్మారక నిర్మాణం వద్దకు చేరుకున్నాడు. అతనికి మోహన్ ఫౌండేషన్ ఘన స్వాగతం పలికింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అవయవదానంపై చైతన్యపరుస్తోంది.
దిల్లీ ఎయిమ్స్‌లోని 'అవయవ పునరుజ్జీవ బ్యాంకు' బాధ్యతలు చూసే రాజీవ్ మఖూరి ఇచ్చిన స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు దక్ష తెలిపాడు.
ఇదీ చదవండి :'లీగల్ క్లినిక్'లతో న్యాయసేవలకు నవ్యపథం