తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అతిపెద్ద కిడ్నీ వైద్యశాల

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్​ ‌సౌకర్యం అందించేలా దిల్లీలో సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజూ 500 మందికి ఇక్కడ డయాలసిస్​ సౌకర్యం కల్పించనున్నారు. 24 గంటలు రోగులకు వైద్యసేవలు అందించేలా ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు.

India's biggest' dialysis facility
దిల్లీలో అతిపెద్ద కిడ్నీ వైద్యశాల

By

Published : Mar 13, 2021, 7:09 AM IST

దేశ రాజధానిలో దిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజూ 500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సౌకర్యం అందించేలా తీర్చిదిద్దిన ఈ ఆసుపత్రిలో బిల్లు ఊసే వినిపించదు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో అడుగుపెడుతూనే కనిపించే బిల్లింగ్‌ కౌంటర్‌ ఇక్కడ అస్సలు ఉండదు. 20 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని గురుహరికృష్ణన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో పునరుద్ధరించి దేశంలోనే అతిపెద్ద కిడ్నీ డయాలసిస్‌ ఆసుపత్రిగా మార్చారు. 24 గంటలూ రోగులకు వైద్యసేవలు అందించేలా సిద్ధం చేశారు.

త్వరలో వెయ్యి పడకలు

ఏకకాలంలో 101 మందికి డయాలసిస్‌ చేసేందుకు వీలుగా ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ లెక్కన నిత్యం 500 మందికి డయాలసిస్‌ అందించేంత విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి 101 పడకలున్న ఆసుపత్రిని త్వరలో వెయ్యి పడకల స్థాయికి తీసుకువెళ్లనున్నట్లు దిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌సింగ్‌ సిర్సా తెలిపారు.

ప్రఖ్యాతిగాంచిన వైద్యుల సేవలు

అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలకు తోడు రోగులకు ఉచిత భోజన సౌకర్యం కూడా సమకూరుస్తారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమయ్యే వనరులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చుకుంటారు. దేశంలో కిడ్నీ వైద్యరంగంలో ప్రఖ్యాతిగాంచిన వైద్యుల సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:కీటకానికి మహిళా శాస్త్రవేత్త పేరు

ABOUT THE AUTHOR

...view details