Delhi Earthquake Today :దేశ రాజధాని ప్రజలను భూకంపం కలవరపాటుకు గురిచేసింది. దిల్లీ సమీపంలోని హరియాణా ఫరీదాబాద్‌లో ఆదివారం సాయంత్రం 4.08 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది.
భయంతో ప్రజల పరుగులు!
Earthquake Haryana Right Now :ఫరీదాబాద్‌కు తూర్పున 9 కిలోమీటర్లు, దిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం పేర్కొంది.భూప్రకంపనలతో ఫరీదాబాద్‌లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ కూడా అనేక ఇళ్లల్లోని ఫర్నీచర్ తీవ్రంగా కదిలినట్లు సమాచారం. భయంతో జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన వీడియోలను పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
భూకంపం.. బయటకొచ్చిన కేంద్ర మంత్రి!
Delhi Earthquake 2023 :కొద్దిరోజుల క్రితం.. దిల్లీలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతో భూకంపం సంభవించింది. నేపాల్‌లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించారు. భూకంప సమయంలో సెంట్రల్ దిల్లీలోని నిర్మాణ్ భవన్లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్ మాండవీయ.. అధికారులతో కలిసి బయటకు వచ్చేశారు. ఆ వీడియో కోసం ఇక్కడక్లిక్ చేయండి.