తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉత్తరాఖండ్‌ను అప్పుల్లో ముంచేశారు'

UTTARAKHAND ASSEMBLY ELECTION 2022: ఉత్తరాఖండ్‌ను పాలించిన ప్రభుత్వాలు గత 22 ఏళ్లలో రూ.72,000 కోట్ల రుణాలు తెచ్చినా ఎలాంటి అభివృద్ధి సాధించలేకపోయాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అప్పుల రూపేణా తెచ్చిన ఈ డబ్బు అంతా నేరుగా నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు.

CM ARVIND KEJRIWAL
కేజ్రీవాల్​ ఇంటర్వ్యూ

By

Published : Feb 11, 2022, 8:28 AM IST

UTTARAKHAND ASSEMBLY ELECTION 2022: ఆధ్యాత్మికతకు నెలవైన ఉత్తరాఖండ్‌ను పాలించిన ప్రభుత్వాలు గత 22 ఏళ్లలో రూ.72,000 కోట్ల రుణాలు తెచ్చినా ఎలాంటి అభివృద్ధి సాధించలేకపోయాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అప్పుల రూపేణా తెచ్చిన ఈ డబ్బు అంతా నేరుగా నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. తమకు అధికారమిస్తే దిల్లీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరులోనే ఉత్తరాఖండ్‌లోనూ చేసి చూపిస్తామన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి కాంగ్రెస్‌, భాజపా మధ్య అధికారం దోబూచులాడే ఉత్తరాఖండ్‌లో ఈసారి ఆప్‌ బరిలో దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తం 70 స్థానాల్లోనూ ఆప్‌ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా విశ్రాంత కర్నల్‌ అజయ్‌ కోఠియాల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ 'ఈటీవీ భారత్‌'తో ముఖాముఖి మాట్లాడారు.

పనిచేసి చూపించాం

'దిల్లీలో నిజాయతీతో పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అభివృద్ధి చేసి చూపించాం. అందుకే ప్రజలు రెండుసార్లు మాకు పట్టం కట్టారు. దిల్లీ మాదిరిగానే ఉత్తరాఖండ్‌ ప్రజలకూ విద్యుత్తు, తాగునీరు, మంచి ఆసుపత్రులు, విద్య, ఉపాధి వంటివి కావాలి. మాకొక అవకాశం ఇస్తే దిల్లీ మాదిరిగా ఇవన్నీ ఇక్కడా కల్పిస్తాం. ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వడం సమస్యేమీ కాదు. ఉత్తరాఖండ్‌లో నేతలు ఒక్కొక్కరికి రూ.వందల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి. స్విస్‌ బ్యాంకుల్లోనూ, ఇతర దేశాల్లోనూ వారి డబ్బు మూలుగుతోంది. అందమైన ఈ రాష్ట్రంలో వనరులకు, ఆదాయానికి, ఆధ్యాత్మిక కేంద్రాలకు లోటు లేదు. అలాంటప్పుడు భారీ మొత్తంలో రుణాలు చేయడంలో అర్థం లేదు. రూ.4,000 కోట్ల ఖర్చుతో హామీలన్నీ నెరవేర్చవచ్చు.

అవినీతి పరుల్ని చేర్చుకోవట్లేదు

ఉత్తరాఖండ్‌లో అనేకమంది పెద్ద నాయకులు ఆప్‌లోకి రావాలని భావిస్తున్నారు. వారు అవినీతిపరులు కావడంతో మేమే చేర్చుకోవడం లేదు. సర్వేలను నేను నమ్మను. దిల్లీలో మాకు 6-7% ఓట్లే వస్తాయని సర్వేలు చెబితే గణనీయమైన ఆధిక్యంతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఉత్తరాఖండ్‌లోనూ అలాగే అవుతుంది. ఈ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. దేశభక్తి ఉన్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాం. రిటైరయ్యాక కూడా ఆయన స్వచ్ఛంద సేవ చేస్తున్నారు' అని కేజ్రీవాల్‌ చెప్పారు.

ఇదీ చూడండి:

ఆ రాష్ట్ర ఎన్నికల్లో రూ.404 కోట్ల విలువైన మద్యం స్వాధీనం!

''యూపీ కేరళలా మారితే..' యోగి భయమంతా అందుకే..!'

ABOUT THE AUTHOR

...view details