తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యానికి కొత్త శక్తి- 118 యుద్ధ ట్యాంకులు కొనుగోలు - defence news india

118 అర్జున ట్యాంకర్ల కొనుగోలుకు భారత రక్షణశాఖ(defence news india) చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్​ ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకుంది(arjun mk1a tank). ఈ ఒప్పందం విలువ రూ. 7,523కోట్లు. ఈ ట్యాంకర్లు సైన్యానికి అదనపు శక్తిగా నిలుస్తాయని రక్షణశాఖ పేర్కొంది.

arjuna tanks
అర్జున

By

Published : Sep 23, 2021, 7:12 PM IST

Updated : Sep 23, 2021, 7:20 PM IST

118 ఎమ్​బీటీ(మెయిన్​ బ్యాటిల్​ ట్యాంక్స్​) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి(arjun mk1a tank). ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ(defence news india). దీని విలువ రూ. 7,523కోట్లు.

చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్​ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్​కే-1ఏ కోసం ఆర్డర్లు ఇచ్చింది రక్షణశాఖ. ఇందులో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ఎమ్​కే-1 వేరియంట్​తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉండనున్నాయి. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉంది.

రక్షణ రంగంలో 'మేక్​ ఇన్​ ఇండియా'కు ఈ ఆర్డర్లు మరింత ఊతమందిస్తాయని రక్షణశాఖ ప్రకటించింది(atmanirbhar bharat defence sector).

ఇదీ చూడండి:-Indian Air Force: వాయుసేనకు 56 రవాణా విమానాలు

Last Updated : Sep 23, 2021, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details