తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాతో భారత్ రూ.423 కోట్ల రక్షణ ఒప్పందం - టార్పెడో ఆయుధాలు

భారత నావికా దళం కోసం ఎంకే 54 టార్పెడో(Mk 54 Torpedo India) ఆయుధాలను అమెరికా నుంచి భారత్​ దిగుమతి చేసుకోనుంది. ఇందుకోసం ఆ దేశంతో రూ.423 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

mk 54 torpedo india
అమెరికాతో భారత్ రక్షణ ఒప్పందం

By

Published : Oct 22, 2021, 10:45 PM IST

అమెరికాతో భారత్​ రూ.423 కోట్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత నావికాదళం కోసం ఎంకే 54 టార్పెడో(Mk 54 Torpedo India) ఆయుధాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఈ ఆయుధాలు పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఉపయోగించనున్నారు. ఇది ముందస్తు సముద్ర నిఘా సామర్థ్యాలకు ఉపయోగ పడుతుంది.

భారత నావికా దళం మొత్తం 11 పీ-8ఐ విమానాలను కలిగి ఉండగా... వీటిని US ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ తయారు చేసింది. ఈ తాజా ఒప్పందం గురించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇదీ చూడండి:DRDO Abhyas test: 'అభ్యాస్' పరీక్ష విజయవంతం​

ABOUT THE AUTHOR

...view details