ఇసుక దిబ్బ కూలిపోయి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా జిల్లా మోరంగ్ మైనింగ్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఇసుక మైనింగ్‌లో ప్రమాదం- వ్యక్తి మృతి ఇసుక దిబ్బకూలడం వల్ల మృతి చెందిన వ్యక్తి ప్రమాదం జరిగింది ఈ ఇసుక క్వారీలోనే బంటు, గజరాజ్, రామ్‌శరణ్ అనే ముగ్గురు కూలీలు మోరంగ్ మైనింగ్‌లోని ఇసుకను ట్రక్కులకు ఎత్తుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇసుక దిబ్బకూలింది. దాంతో ఆ ముగ్గురు ఇసుకలో కూరుకుపోయారు. వెంటనే గమనించిన ఇతర కూలీలు వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే వారు చనిపోయారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, మృతుల బంధువులు పెద్దఎత్తున ఘటనా ప్రదేశానికి వచ్చారు. వారు చనిపోవడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృత దేహాలతో రహదారపై ధర్నా చేశారు. మైనింగ్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చి కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ- ఇద్దరు మృతి