హరియాణాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించడం వల్ల పక్క ఇళ్లు కూడా దగ్దమయ్యాయి. ఈ ఘటన పానీపత్ జిల్లాలో జరిగింది. మృతులను అబ్దుల్ కరీమ్(50), అఫ్రోజా(46), ఇష్రత్ ఖటుమ్(17), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్(7)గా పోలీసులు గుర్తించారు. కాగా, వీరంతా బంగాల్‌కు చెందిన ఉత్తర దినాజ్‌పుర్ వాసులని పోలీసులు తెలిపారు. అయితే ఉదయం వంట వండుతున్నప్పుటు గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.
ఇలాంటి ఘటనే సోమవారం హరియాణాలోని రేవారి జల్లాలో జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 20 గుడిసెలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కార్నవాస్ అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. కాగా, ఈ అగ్నిప్రమాదంలో పెళ్లి సామగ్రి మొత్తం కాలిపోయింది.
హీటర్ షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు సజీవ దహనం..
హీటర్షార్ట్సర్య్కూట్ కావడం వల్ల తల్లి సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫైర్ ఇంజిన్, స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రాజు పాల్, అతడి భార్య అనిత (28) కురారా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జల్లా అనే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోహిని(6), రోహిని(3) ఉన్నారు. వీరంతా నిద్రిస్తున్న సమయంలో రూమ్ హీటర్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు వ్యాపించి అనితతో పాటు ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిందని సమాచారం. సమచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హమీర్పుర్ ఎస్పీ, డీఎమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.