- 'తౌక్టే' తుపాను దృష్ట్యా గుజరాత్‌లో పలు రైళ్లు రద్దు
- ఈ నెల 17, 18న గుజరాత్ తీరాన్ని దాటనున్న 'తౌక్టే' తుపాను
- ఐఎండీ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన రైల్వే శాఖ
తీవ్రరూపం దాల్చిన 'తౌక్టే' తుపాను
21:50 May 15
19:29 May 15
గుజరాత్ తీరం వైపు తౌక్టే తుపాను..
తుపాను తౌక్టే తీవ్ర రూపం దాల్చుతూ.. గుజరాత్ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతాలు దామన్ దయ్యూ, దాద్రా, నగర్ హవేళీలపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం రాత్రి నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర-వాయవ్య దిశగా కదిలి పోరుబందర్, నలియా మధ్య మే 18న తీరం దాటనుందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అయితే.. ముంబయి వంటి నగరాలు అంతగా ప్రభావితం కావని తెలిపింది. నార్త్ కొంకణ్, ముంబయి వంటి ప్రాంతాల్లో మే 17న ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
19:19 May 15
తుపాను తౌక్టే తీవ్ర రూపం- పరిస్థితులపై మోదీ సమీక్ష
తుపాను తౌక్టే తీవ్ర రూపం దాల్చుతోంది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా కేంద్రీకృతమై ఉంది ఈ సైక్లోన్. వచ్చే 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంబంధిత కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో వర్చువల్‌గా సమావేశమై చర్చించారు. తుపానును ఎదుర్కొనేందుకు పకడ్బంధీగా చర్యలు చేపట్టాలని సూచించారు.
17:17 May 15
- విదర్భ పరిసర ప్రాంతాల్లో బలహీనపడిన ఆవర్తనం
- గోవాకు దక్షిణ నైరుతి దిశగా కేంద్రీకృతమైన 'తౌక్టే' తుపాను
- గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో తౌక్టే తుపాను
- రాగల 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న తౌక్టే
- తదుపరి 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న తౌక్టే
- ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడనున్న తౌక్టే తుపాను
- ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనున్న 'తౌక్టే' తుపాను
- ఈ నెల 18న మ.2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య తీరం దాటే అవకాశం
- పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్న 'తౌక్టే' తుపాను
11:08 May 15
- అమిని దీవికి ఈశాన్య దిశగా 160 కి.మీ. దూరంలో తౌక్టే తుపాను
- మరింత బలపడి మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా తౌక్టే
- ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడనున్న తౌక్టే తుపాను
- తదుపరి 12 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనున్న తౌక్టే
- ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనున్న 'తౌక్టే' తుపాను
- ఈ నెల 18న మ. 2.30 నుంచి రాత్రి 8.30 మధ్య తీరం దాటే అవకాశం
- పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్న 'తౌక్టే' తుపాను
- తీరం దాటేప్పుడు 150-175 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
10:54 May 15
ఎన్డీఆర్ఎఫ్ మోహరింపులు
తుపాను పరిస్థితుల నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభావిత రాష్ట్రాలకు పంపుతోంది కేంద్రం. భువనేశ్వర్ నుంచి ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీటిని పంపినట్లు అధికారులు తెలిపారు. ద్వారకా, పోర్‌బందర్ వంటి తీర ప్రాంతాల్లో వీరిని మోహరించనున్నట్లు చెప్పారు.
శనివారం ఉదయం తుపానుగా మారిన తౌక్టే.. ప్రస్తుతం లక్షదీవుల వద్ద కేంద్రీకృతమైంది.
10:40 May 15
మోదీ సమావేశం!
ముంచుకొస్తున్న తౌక్టే తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సమీక్ష చేపట్టనున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర అలర్ట్
తౌక్టే తుపానుపై భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని జిల్లాలకు హైఅలర్ట్ జారీ చేసింది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగేలా చూడాలని చెప్పారు.
పాల్ఘఢ్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఠాక్రే సూచించారు.
09:48 May 15
కేరళలో భారీ వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలప్పురం జిల్లాలో శనివారం సైతం భీకర వర్షాలు కొనసాగాయి. ఈ జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వాయుగుండం బలపడి శనివారం.. 'తౌక్టే' తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 150-170 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
03:35 May 15
తీవ్రరూపం దాల్చిన 'తౌక్టే' తుపాను
లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శనివారం అది 'తౌక్టే' తుపానుగా రూపాంతరం చెంది ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని హెచ్చరించింది.
తౌక్టే కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర సర్కారు.. తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించి, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అధికారులు గస్తీని ముమ్మరం చేశారు.
తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలో అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీరాల్లో 53 బృందాలను మోహరించినట్టు వివరించింది.