తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 4:32 PM IST

ETV Bharat / bharat

'తౌక్టే' తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది?

భారత్​లో ఈ ఏడాది వచ్చిన మొదటి తుపాను 'తౌక్టే'. కేరళ, కర్ణాటక, తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. అయితే.. ఈ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుపానులకు పేర్లు ఎందుకు? తెలుసుకుందాం.

Cyclone Tauktae gets its name from a gecko
'తౌక్టే' తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది?

2021లో భారత్​లో వచ్చిన మొదటి తుపాను తౌక్టే.. కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కర్ణాటక, గోవా తీరం తాకిన తుపాను.. వడివడిగా గుజరాత్ తీరం వైపు దూసుకెళ్తోంది. అయితే ఈ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది?

ఊసరవెల్లి నుంచి..

'తౌక్టే' అనే పేరు మయన్మార్​ పెట్టింది. బర్మీస్​ భాషలో తౌక్టే అంటే.. ఊసరవెల్లి అని అర్థం. ఈ ఊసరవెళ్లి పెద్దగా శబ్దం చేస్తుంది. చీకట్లోనూ చూడగలదు. భూగ్రహంపై 1500లకు పైగా ఊసరవెల్లి జాతులు ఉన్నాయి. ఒక్కో జాతి ఒక్కో ప్రత్యేకతను కలిగిఉంటాయి.

నాలుగోస్థానం..

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విభాగం.. తుపాన్లకు గతేడాది 169 పేర్లతో ఓ లిస్టును విడుదల చేసింది. అందులో తౌక్టే పేరు నాలుగో స్థానంలో ఉంది.

తుపాన్లకు పేర్లు ఎందుకు పెడతారు?

వరల్డ్ మెటీరియోలాజికల్​ ఆర్గనైజేషన్​(డబ్ల్యూఎంఓ), యూనైటెడ్ నేషన్స్​ ఎకానమిక్​ అండ్ సోషియల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్​ సభ్యత్వ దేశాలైన బంగ్లాదేశ్, భారత్​, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్​లాండ్​లు.. వాటి దేశాలను తాకిన తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి.

ఒక్కో దేశం వారి ఛాయిస్​ మేరకు కొన్ని పేర్లను పంపించిన తర్వాత డబ్ల్యూఎంఓ ప్యానెల్ తుది జాబితాను విడుదల చేస్తుంది.

సమాచారం సులభంగా

తుపాన్లకు నంబర్లు ఇవ్వటం కంటే పేర్లను పెట్టటం వల్ల సాధారణ ప్రజలు, శాస్త్రవేత్తలు, మీడియా, విపత్తు నిర్వాహణ బృందం సులభంగా పేరును గుర్తుపెట్టుకుంటారు. సమాచారాన్ని సులభంగా చేరవేయవచ్చు.

గతేడాది వచ్చిన 'అంఫన్ తుపాను' పేరును 2004లో థాయ్​లాండ్​ సూచించింది.

ఇదీ చదవండి :తౌక్టే బీభత్సం- వణికిపోతున్న రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details