Covid vaccine price: కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా టీకాల ధరను రూ.275గా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి సాధారణ అనుమతి పొందిన తర్వాత ఈ మేరకు ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనికి రూ.150 సేవా రుసుం అదనమని పేర్కొన్నాయి.
Covid vaccine price: త్వరలో రూ.275కే కరోనా టీకాలు! - కొవాగ్జిన్ టీకా ధర
Covid vaccine price: కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా టీకాల ధరను రూ.275గా ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి సాధారణ అనుమతి పొందిన తర్వాత ఈ మేరకు ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200 కాగా.. కొవిషీల్డ్ ధర రూ.780గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు అనుమతి పొందాయి. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ ఈనెల 9న ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సమర్పించాయి.
ఇదీ చూడండి:భారత్-పాక్ సరిహద్దులో 'బీటింగ్ రీట్రీట్' వేడుకలు