దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏప్రిల్‌లోనే 1500 మంది దిల్లీ పోలీసులు వైరస్ బారినపడ్డట్లు తెలుస్తోంది.
వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 9000కు పైగా దిల్లీ పోలీసులకు కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 37మంది చనిపోయారని, ఈ ఏప్రిల్‌లో ఇద్దరు మృతి చెందారని తెలిపారు.
రైల్వే సిబ్బందికి..
2300 మంది తూర్పు రైల్వే సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. లాక్డౌన్ భయంతో బిహార్‌కు వలసలు పెరిగిన నేపథ్యంలో ఈ కేసులు పెరిగినట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయినా రైల్వేలను వలస కూలీలకోసం నడపడం ఆపబోమని తూర్పు రైల్వే శాఖ పీఆర్ఓ సంజయ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:8 రోజుల్లోనే కొవిడ్ ఆస్పత్రి నిర్మాణం