దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యలు ఫలిస్తోన్న వేళ తమిళనాడులో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 31,079 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు మరణాల్లో అత్యధికంగా 486 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తొలిసారి కేసుల సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. 31, 255 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధానిలో వైరస్ కట్టడి చర్యలు సఫలీకృతమవుతున్నాయి. కొత్తగా 1,141 కేసులు వెలుగులోకి వచ్చాయి. 139 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
మహారాష్ట్రలో 20,740 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 424 మంది చనిపోయారు.
కేరళలో 22,318 కేసులు నమోదయ్యాయి. 194 మంది మృతి చెందారు.