Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు ఒక్కరోజే 15,940 మంది వైరస్ బారినపడగా.. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 12,425 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.59 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.20 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,378,234
- మొత్తం మరణాలు: 5,24,974
- యాక్టివ్ కేసులు: 91,779
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,61,481
Vaccination India: భారత్‌లో శుక్రవారం 15,73,341 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,94,40,932 కోట్లకు చేరింది. మరో 3,63,103 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. 713,490 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,421మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 523,130,492కు చేరింది. మరణాల సంఖ్య 6,349,289 చేరింది. ఒక్కరోజే 443,401 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 108,190 కొత్త కేసులు బయటపడగా.. 98 మంది మరణించారు.
- అమెరికాలో 102,916 కేసులు వెలుగుచూశాయి. 237 మందికిపైగా చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 79,262 కొత్త కేసులు నమోదుకాగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 66,993 కేసులు నమోదు కాగా.. 324 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 55,829 మంది కొవిడ్ బారినపడగా..51 మంది ప్రాణాలు కోల్పోయారు.