Covid Cases in India: కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న కేరళలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మరో 42,677 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 601 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బుధవారంతో పోలిస్తే కేసులు భారీగా తగ్గినా.. మరణాలు పెరిగాయి. వైరస్ నుంచి 50,821 మంది కోలుకున్నారు.
కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. పెరిగిన మరణాలు
Covid Cases in India: కేరళలో కరోనా ఉద్ధృతి భారీగా తగ్గింది. కొత్తగా 42,677 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం కేరళలో మొత్తం కేసుల సంఖ్య 61,72,432గా ఉంది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
కొవిడ్ కేసులు
కేరళలో మొత్తం కేసుల సంఖ్య 61,72,432కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 3,69,073గా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నమోదైన 601 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 52,199కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 444 మంది ఆరోగ్య కార్యకర్తలు, 202 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది.
- దిల్లీలో కొత్తగా 2,668 కేసులు బయటపడ్డాయి. 3,895 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 13,630కు చేరింది.
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
కర్ణాటక | 16,436 | 60 |
తమిళనాడు | 11,993 | 30 |
గుజరాత్ | 7,606 | 34 |
మధ్యప్రదేశ్ | 7,430 | 9 |
ఆంధ్రప్రదేశ్ | 4,605 | 10 |
తెలంగాణ | 2,421 | 2 |
బంగాల్ | 1,916 | 36 |
ఇదీ చూడండి :ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా- 50లక్షల టీకాల ఎక్స్పైరీపై కేంద్రం క్లారిటీ
Last Updated : Feb 3, 2022, 10:10 PM IST