తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. 4 కోట్లు దాటిన కేసులు - Corona cases in India

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,85,914 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 665 మంది మరణించారు. 2,99,073 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

INDIA CORONA CASES
భారత్ కరోనా కేసులు

By

Published : Jan 26, 2022, 9:24 AM IST

Updated : Jan 26, 2022, 9:54 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,85,914 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 665 మంది మరణించారు. 2,99,073 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసులు 4 లక్షలు దాటాయి.

  • మొత్తం కేసులు:4,00,85,116
  • మొత్తం మరణాలు:4,91,127
  • యాక్టివ్ కేసులు:22,23,018
  • మొత్తం కోలుకున్నవారు:3,73,70,971

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 59,50,731 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,58,44,536కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 33,20,485 మందికి కరోనా సోకింది. 9,650 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,90,43,286కి చేరగా.. మరణాల సంఖ్య 56,33,406కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా4,43,072 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,611 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.3 కోట్లు దాటింది.
  • అమెరికా నుంచి భారత్​కు వెళ్లే పౌరులు పునరాలోచించుకోవాలని అమెరికా ప్రభుత్వ సూచించింది. భారత్​లో కొవిడ్-19 ఉద్ధృతి దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
  • "ఎఫ్​డీఏ ఆమోదించిన కొవిడ్​-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం కొద్దిగా తగ్గుతుంది. భారత్​లో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆ దేశానికి వెళ్లే పౌరులు మరోసారి ఆలోచించుకోవాలి." అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్​(సీడీసీ) పేర్కొంది. కరోనా వ్యాప్తి దేశాల్లో భారత్​ను లెవెల్-3 లిస్ట్​లో చేర్చింది అమెరికా. ఉగ్రావాదం కారణంగా జమ్మకశ్మీర్​లోనూ పర్యటించవద్దని అమెరికా ప్రభుత్వం సూచనలు చేసింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 5,01,635కేసులు వెలుగుచూశాయి. మరో 467 మంది చనిపోయారు.
  • ఇటలీలో 186,740 కొత్త కేసులు బయటపడగా.. 338 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,99,126 మందికి వైరస్​ సోకగా.. 489 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,00,863 కరోనా కేసులు బయటపడగా.. 259 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,48,408 వేల మందికి వైరస్ సోకింది. మరో 184మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 94,326 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 439 మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో తాజాగా 1,14,877 కేసులు బయటపడ్డాయి. మరో 382 మంది మరణించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:దేవభూమిలో పంచ రణక్షేత్రాలు.. గెలిచేదెవరో?

Last Updated : Jan 26, 2022, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details