కరోనా సోకిన వారు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లించాల్సిన పనిలేదంటూ రూపొందించిన మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేయాలని సోమవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథమికంగా ఈ నిబంధనతో ఏకీభవించడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పింది.
'కరోనా మార్గదర్శకాలను పునఃపరిశీలించండి' - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్
కొవిడ్ మృతులకు చెల్లించే పరిహారంపై పునరాలోచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మహమ్మారి సోకిన సమయంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వబోమని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
covid
మరోవైపు మార్గదర్శకాల జారీలో కావాలనే కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ న్యాయవాది దీపక్ కన్సల్ దావా వేశారు.
ఇవీ చదవండి: