భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా టీకా సురక్షితమైందని ఓ అధ్యయనం చెబుతోంది. కొవాగ్జిన్ ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా రోగనిరోధక ప్రతిస్పందన కలిగిస్తుందని 'ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్' జర్నల్ తెలిపింది. కొవాగ్జిన్ టీకాపై రెండో దశ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలను ఈమేరకు వెల్లడించింది. అయితే ఈ అధ్యయనంలో బీబీవీ152 వ్యాక్సిన్ సమర్థతను అంచనా వేయలేదని పరిశోధకులు తెలిపారు.
కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.