తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా'

Harsha vardhan
కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్‌

By

Published : Jan 2, 2021, 11:53 AM IST

Updated : Jan 2, 2021, 2:17 PM IST

11:52 January 02

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా

దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్‌. 'తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్లమంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా అందజేస్తాం. ప్రాధాన్య క్రమంలో ఉన్న తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నాం' అని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

వ్యాక్సిన్‌ భద్రతపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ భద్రత, సమర్థత, రోగనిరోధకశక్తి  పెంపుదలకు సంబంధించిన విషయాల్లో ఏ ఒక్కదానిపైనా రాజీపడేది లేదన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా టీకా మెగా డ్రై రన్‌లో భాగంగా దిల్లీలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాలను కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

" పోలియో టీకాకరణ సందర్భంగా కూడా వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. క్రమంగా బాధిత కుటుంబాలు టీకా ఆవశ్యకతను గుర్తించి తమ పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పించాయి. ఆ తర్వాత పోలియోరహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా భారత్‌ గుర్తింపు పొందింది. కరోనా టీకా ప్రజల ఆరోగ్యం కోసమేనని, ఈ విషయమై ఎలాంటి అపోహలను మనసులో పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి  చేస్తున్నాను. కోవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ సిఫారసులను డీసీజీఐ పరిశీలించి త్వరలోనే నిర్ణయం వెలువరిస్తుంది. "  

          - హర్షవర్దన్‌, కేంద్ర వైద్య శాఖ మంత్రి

259 ప్రాంతాల్లో డ్రై రన్​..

దేశవ్యాప్తంగా  కరోనా టీకా  రెండోవిడత  మెగా డ్రై రన్‌ను కేంద్ర నిర్వహిస్తోంది. 116జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర మినహా అన్నిరాష్ట్రాలు ఆయా రాష్ట్రాల రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. డిసెంబర్​ 28, 29 తేదీల్లో.. ఆంధ్రప్రదేశ్‌, అసోం, పంజాబ్‌, గుజరాత్‌  రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రైరన్ లో వెల్లడైన లోటుపాట్లను సవరించారు. ఆయా రాష్ట్రాల్లో తలెత్తిన ఇబ్బందులు ఇప్పుడు రాకుండా చర్యలు తీసుకున్నారు.

Last Updated : Jan 2, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details