దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 14,146 మందికి కరోనా (Coronavirus update) పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి(Covid cases in India) మరో 144మంది మరణించారు. ఒక్కరోజే 19,788 మంది రికవరీ అయ్యారు.
- మొత్తం కేసులు:3,40,67,719
- మొత్తం మరణాలు:4,52,124
- మొత్తం కోలుకున్నవారు:3,34,19,749
- యాక్టివ్ కేసులు:1,95,846
టీకాల పంపిణీ
శనివారం ఒక్కరోజే 41,20,772 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,65,89,540కు చేరినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,43,318 మందికి వైరస్ (Corona update) సోకింది. కొవిడ్ ధాటికి మరో 5,358 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,11,70,384కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,10,066కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 33,910 మందికి వైరస్ సోకింది. మరో 464 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్ కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 43,423 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. తాజాగా 148 మృతి చెందారు.
- టర్కీలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 28,537 మందికి వైరస్ బారిన పడగా.. 212 మంది మరణించారు.
- రష్యాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాాజాగా 33,208 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,002 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
- ఇరాన్లో కొత్తగా 7,515 మందికి కొవిడ్ సోకగా.. 181 మంది చనిపోయారు.
- బ్రెజిల్లో తాజాగా 11,250 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 472 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:Coronavirus: 'థర్డ్ వేవ్ వచ్చినా.. ప్రభావం తక్కువే'