Corona New Variant Latest News :2019 డిసెంబర్‌లో ప్రపంచం మొత్తం కొత్త వైరస్ గురించి ఆందోళన చెందుతున్న సమయం అది. 2020 కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలుకుదామా అని న్యూ ఇయర్ ఈవెంట్లకు ప్లాన్ చేసుకునే బదులు భయంతో దేశమంతా వణికిన సమయం అది. అలాంటి సమయంలో దేశాన్ని, ప్రజలను ముందుకు నడిపింది ఐసీఎంఆర్.
Dr Balaram on JN1 Variant :అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌తో తక్కువ మరణాలు సంభవించడంలో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషింది. అలాంటి ప్రాణాంతక కొవిడ్ సమయంలో ఐసీఎంఆర్ డీజీగా వ్యవహరించారు డాక్టర్ బలరాం భార్గవ. అనుక్షణం కొవిడ్తోపోరాడేందుకు పోరాడారు. అలాంటి విపత్తే మరోసారి రానున్నట్లు కనిపిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్1 రూపంలో కరోనా మరోసారి విలయం సృష్టించడానికి వస్తున్న ఈ సమయంలో ఈ వేరియంట్ గురించి, రాబోయే విలయాన్ని నివారించడం ఎలా? అనే విషయాలపై డాక్టర్ బలరాం భార్గవతో ఈటీవీ ముఖాముఖి.
కొత్త వేరియంట్‌తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు
- 1. కరోనా సమయంలో మీ ప్రెస్‌మీట్ల కోసం ప్రజలు ఎదురు చూసే వారు. మహమ్మారిపై ప్రజలకు మీరు మార్గనిర్దేశం చేశారు. కొవిడ్ వేళ మీ మానసిక స్థితి ఎలా ఉండేది.?
జవాబు: ఆ సమయంలో మన దేశం, ప్రజలు, సోదర సోదరీమణుల కోసమే మేమంతా పనిచేశాం. అదే మమ్మల్ని నడిపించింది.
- 2. కొవిడ్ మహమ్మారికి కొన్ని నెలల్లోనే వాక్సినేషన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ పరిశోధనల కోసం భారత్‌లో ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుంది. కొవిడ్‌కు కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ వచ్చింది. అది ఎలా జరిగింది.?
జవాబు: యుద్ధ ప్రాతిపదికన పనిచేశాం. ఉమ్మడి కృషి జరిగింది. రెండు ల్యాబ్స్, రెండు సంస్థలు, రెండు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేశాయి. అంతా కలిసి పనిచేయడం వల్లే వ్యాక్సిన్ తొందరగా అందుబాటులోకి వచ్చింది.
- 3. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై చాలా అపొహలు అప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఈ అంశంపై మీరేమంటారు.?
జవాబు : దేశ పౌరులకు అభినందనలు చెబుతాను. మేము ఇచ్చిన సలహాలను వారు విన్నారు. ఈ విషయంలో వేరే ఏ దేశాలతో పోల్చినా మన ప్రజలు గొప్ప పౌరులు.
- 4. ప్లాస్మా థెరపీలో మంచి చెడులు ఉన్నాయి. కొన్ని యాంటిబయెటిక్స్, మందుల వల్ల బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు వచ్చాయి. ఇలాంటి ప్రతికూల అంశాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు.?