దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. తమిళనాడులోనూ వైరస్ తీవ్రత తగ్గుతోంది. ఆదివారం ఆ రాష్ట్రంలో కొత్తగా 28,864 కేసులు నమోదు కాగా, 32,982 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. 493మంది మృతిచెందారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 946 కేసులు వెలుగులోకి వచ్చాయి. 78 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కర్ణాటకలో 20,378 కేసులు బయటపడ్డాయి. 382 మంది మరణించారు.
- కేరళలో 19,894 కేసులు నమోదయ్యాయి. 186 మంది మృతి చెందారు.
- మహారాష్ట్రలో 18,600 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది మార్చి అర్ధభాగం తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 402 మంది చనిపోయారు.
- రాజస్థాన్లో 2,298 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. 66 మంది చనిపోయారు.
- పంజాబ్లో 2,627 కేసులు వెలుగుచూశాయి. 127 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!