దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. మరోవైపు.. తమిళనాడులో వైరస్ పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 30,016 కేసులు నమోదు కాగా, 31,759 మంది డిశ్చార్జ్ అయ్యారు. 486 మంది మృతిచెందారు.
దేశ రాజధానిలో వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 956 కేసులు వెలుగులోకి వచ్చాయి. 122 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో 23,513 కేసులు నమోదయ్యాయి. 198 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో 20,628 కేసులు బయటపడ్డాయి. 492 మంది మరణించారు.
- మహారాష్ట్రలో 20,295 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 443 మంది చనిపోయారు.
- బంగాల్లో 11,514 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. 148 మంది చనిపోయారు.
- ఒడిశాలో 7,188 కేసులు వెలుగుచూశాయి. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:కరోనా పరీక్షలకు ఇక సులువైన విధానం!