తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 1,778 మందికి పాజిటివ్​​ - కరోనా న్యూస్

Covid Cases India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి . మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 1,778 మంది వైరస్ బారినపడ్డారు. మరో 62 మంది వైరస్​ కారణంగా మరణించారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Mar 23, 2022, 9:06 AM IST

Updated : Mar 23, 2022, 12:41 PM IST

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 1,778 మందికి వైరస్​ సోకింది. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,542 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం మరో 30,53,897 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,89,15,234కు పెరిగింది. మంగళవారం 6,77,218 కరోనా టెస్టులు నిర్వహించారు.

  • మొత్తం కేసులు:4,30,12,749
  • మొత్తం మరణాలు:5,16,605
  • యాక్టివ్​ కేసులు:23,087
  • కోలుకున్నవారు:4,24,73,057

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 16,85,408 కొత్త కేసులు వెలుగుచూశాయి. 4,965 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,40,83,448కు చేరగా.. మృతుల సంఖ్య 61,21,947కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3.5లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటికి సమీపించింది.

కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాలు

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 353,725 384 99,36,540 13,141
2 వియత్నాం 1,30,735 65 83,38,914 42,014
3 జర్మనీ 2,68,357 324 1,91,34,583 1,27,865
4 ఫ్రాన్స్​ 1,80,777 133 2,43,42,116 1,41,218
5 ఇటలీ 96,365 197 1,39,92,092 1,58,101
Last Updated : Mar 23, 2022, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details