తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid cases: తమిళనాడులో తగ్గని ఉద్ధృతి - తమిళనాడులో కరోనా

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. తమిళనాడులో మళ్లీ 33వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 24 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరోవైపు.. దిల్లీలో వైరస్​ పాజిటివిటీ రేటు 2 శాతం లోపే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

India cases
కోరనా

By

Published : May 27, 2021, 11:06 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్​ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. తమిళనాడులో 33,361 కేసులు బయటపడ్డాయి. 474 మంది మృతి చెందారు. దేశ రాజధానిలో వైరస్​ కట్టడి చర్యలు ఫలిస్తున్నాయి. కొత్తగా 1,072 కేసులు వెలుగులోకి వచ్చాయి. 117 మంది వైరస్ బారిన పడి మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో 21,273 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 425 మంది చనిపోయారు.
  • కేరళలో 24,166 కేసులు నమోదయ్యాయి. 151 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 24,214 కేసులు బయటపడ్డాయి. 476 మంది మరణించారు.
  • బంగాల్​లో 13,046 మందికి కరోనా నిర్ధరణ అయింది. 148 మంది వైరస్​ కారణంగా మరణించారు.

ఇప్పటివరకు దేశంలో 20.54 కోట్ల వాక్సిన్​ డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 మధ్య వయసు వారిలో గురువారం 11 లక్షల మందికి పైగా మొదటి డోసు వేసుకున్నారని వెల్లడించింది.

ఇదీ చదవండి:జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details