Corona cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 67,084 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,67,882 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.86 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.95 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,24,78,060
- మొత్తం మరణాలు:5,06,520
- యాక్టివ్ కేసులు:7,90,789
- మొత్తం కోలుకున్నవారు:4,11,80,751
దేశంలో కొత్తగా 46,44,382 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,28,19,947 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24,03,051 మంది కరోనా బారినపడ్డారు. 11,464 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40.36 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,795,887కు చేరింది.
- జర్మనీలో మరో 2,38,410 మంది వైరస్ బారినపడ్డారు. మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో ఒక్కరోజే 2,27,458 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 2,785 మంది మృతిచెందారు.
- రష్యాలో కొత్తగా 183,103 మందికి కరోనా సోకింది. 669 మంది మరణించారు.
- టర్కీలో తాజాగా 1,08,563 కేసులు బయటపడగా.. 266 మంది బలయ్యారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 1,83,533 మందికి వైరస్ సోకింది. మరో 1,295 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి:కేరళలో భారీగా తగ్గిన కేసులు.. హిమాచల్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత